ఈ అపురూప నాటక కథలులో షేక్స్‌పియర్ రచిచంచిన వెన్నిస్ వర్తకుడు, కింగ్ లియర్, కవలల కలకలం, నడిరేయి మిడిమేలం, జూలియస్ సీజర్, మేక్బెత్ ఆరునాటకాలను కథారూపంలో మీకు అందిస్తున్నాం. ఈ ఆరూ సుప్రసిద్ధమైనవే. ఆనంద ఆశ్చర్య వినోదాలతో పాటు లోకంలోని వివిధ రకాలయిన వ్యక్తులు, వారి గుణ స్వభావాలు- ఆశ, లోభం, క్రోధం, మోహం అహంకారం మనుషుల్ని ఎలా బలితీసుకుంటాయో ఈ కథల్లో ఆయా పాత్రల ద్వారా మనకు తేటతెల్లమవుతుంది. మనుషుల్లో ప్రాథమికంగా ఉండాల్సిన దయ, కరుణ, ప్రేమలను ఈ కథలు ప్రభోధిస్తాయి. షేక్స్‌పియర్ రచనలలో సర్వకాలీన మానవునికి అవసరమైన మానవీయత నిక్షిప్తమై ఉంటుంది. అందుకే శతాబ్దాలు గడచినా నేటికీ షేక్స్‌పియర్ మన మధ్యనే ఉన్నాడు.
- విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్

No comments:
Post a Comment
Visalaandhra Publishing House