
ఈ పుస్తకంలో “ఇన్‌ఫెక్షన్స్” గురించి, వాటిలోని రకాల గురించి అవగాహన కలగడమే గాక, ఇన్‌ఫెక్షన్స్ పట్ల కనీస పరిజ్ఞానాన్ని పొందుతారు. మామూలుగా ప్రజలు మాట్లాడుకునే సమయంలో “బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్స్” అనీ, “వైరల్ ఇన్‌ఫెక్షన్స్” అని అంటారే గాని, వాటివల్ల వచ్చే వ్యాధుల గురించి, వాటిని వాడే “యాంటి బయాటిక్స్” గురించి అవగాహన కలిగి వుండరు. అలాగే కామెర్లు, టైఫాయిడ్, టి.బి., జ్వరాలు లాంటివే కాకుండా “హెచ్.ఐ.వి. ఇన్‌ఫెక్షన్స్”, “మలేరియా”, “డెంగ్యూ” జ్వరాలు మొదలైన వాటి గురించి కూడా సామాన్య ప్రజలు ఎక్కువగా అవగాహన కలిగివుండరు. వారి అవగాహన పెంపుదలకు ఈ పుస్తకంలో తగిన విధంగా సమాచారాన్ని రచయిత్రి అందించారు.
No comments:
Post a Comment
Visalaandhra Publishing House