స్త్రీ పురుషుల భావోద్వేగాలలో, ఆలోచనల్లో చాలా తేడాలుంటాయి. వాటిని అనుభవించే తీవ్రత – ముఖ్యంగా మాతృత్వం – స్ర్రీకి చాలా ఎక్కువగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ స్త్రీలు కోల్పోకూడనిది ఆత్మవిశ్వాసం, ఆత్మబలం. జీవితమంటేనే అనుభవం. మన అనుభవాలకే కాకుండా ఇతరుల అనుభవాలకి స్పందించగలిగినప్పుడు, ఆ స్పందన తీవ్రతని అక్షర రూపంగా మార్చగలిగినప్పుడు కథ పుట్టడమే కాదు ఆ కళ మనలోని చైతన్య స్థాయినీ పెంచుతుంది. అసలు సిసలు సత్యాన్వేషణకీ, ప్రపంచం పట్ల నిర్వేదానికి మధ్యనున్న సన్నటి గీతను చూపించే తాత్విక విశ్లేషణ, జీవితాంతం తనను నడిపించిన భావన ఏమిటో తెలుసుకున్నప్పుడు కలిగిన స్ఫురణ – ఈ ‘ఆకాశమల్లి’ కథల నిండా కనబడతాయి.

No comments:
Post a Comment
Visalaandhra Publishing House