నిప్పును ఎవరు కవుగొన్నారు... చక్రాన్ని ఎవరు రూపొందించారు... నేడు అందరూ ఎంతో ఇష్టపడే కాఫీకి మూలం ఎవరు... దూరాన ఉన్న మనుషులను సైతం మాటలతో కలిపే టెలిఫోన్ రూపకర్తలు ఎవరు... ఇటువంటి ఎన్నో విషయాలను నాటి చరిత్రగా మిగిలిపోయినా... నేటికి... రేపటికి కూడా నూతనంగానే ఉంటాయి. ఇక్కడి ఆర్యభట్ట నుండి అక్కడి ఐన్‌స్టీన్... ఇలా ప్రపంచంలో ఎందరో శాస్త్రవేత్తల జీవితాలే కాదు, వారి పరిశోధనలు చరిత్రలుగా మిగిలినా భవిష్యత్ ప్రగతికి కొత్తమార్గాల అన్వేషణలో సహాయపడుతూనే ఉన్నాయి. నిత్య నూతనంగా... విజ్ఞాన సంబంధమైన విషయాలకు సంబంధించిన పుస్తకాలు చదవాలని ఎంతోమందికి ఉన్నా... క్లిష్టమైన భాష అడ్డుగా మారింది. ఆయాఅంశాలు మాతృభాషలో లభిస్తే ఎంతో ఉపయుక్తం. కనీసం క్లుప్తంగానైనా మాతృభాషలో ఉండి పలు అంశాలు ఒకేచోట చేర్చితే చదువరులకు ఆసక్తిని, ఇష్టాన్ని కలిగించడంతో పాటు భద్రపరచుకునేందుకు వీలుగా ఉంటుంది. ఆ ప్రయత్నమే ఇది.

No comments:
Post a Comment
Visalaandhra Publishing House