Friday, 16 September 2016

పని వత్తిడి నుంచీ, బరువు బాధ్యతల నుంచీ విముక్తి పొంది స్వేచ్ఛగా, హాయిగా రోజులు గడపవలసిన దశ రిటైర్డు జీవితం. కాని, చాలామంది పెద్దల విషయంలో వాస్తవ పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా ఉండడం విచారకరం. జీవితంలో ఏ దశ అయినా సజావుగా సాగాలి అంటే అందుకు మనకు ముందుచూపు ముఖ్యం. ఒక పథకం, ఒక వ్యూహం ఉండాలి.
ఆర్జన, ఆరోగ్యం, పరపతి, పెత్తనం అన్నీ తగ్గుముఖం పట్టిన రిటైర్డు జీవితాన్ని దాదాపు రెండు మూడు దశాబ్దాల కాలం సంతృప్తికరంగా గడపడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఉద్యోగంలో ఉన్నప్పుడే తగిన ప్రణాళిక సిద్ధపరచుకొని, దానిని జాగ్రత్తగా అమలుచేసిన వివేకవంతులు మాత్రమే ఈ రోజుల్లో తమ శేష జీవితాన్ని హాయిగా గడపగలుగుతున్నారు. అమాయకంగా, అశ్రద్ధగా రిటైర్డ్ జీవితంలో అడుగుపెట్టేవాళ్ళు అనేక సమస్యలపాలవుతున్నారు. అటువంటి మంచి ప్రణాళిక కోసం అందరికీ ఉపయోగపడే పుస్తకం ఇది.
కె. రామిరెడ్డి

No comments:

Post a Comment

Visalaandhra Publishing House