Friday, 16 September 2016

భారతదేశంలోని మార్క్సిస్టు మేధావులను ప్రత్యేకించి, ఉత్తర భారతంలోని మేధావులను ఆయన తాత్విక చింతన ప్రభావితం చేసింది. స్వీయానుభవం, స్వీయ పరిశీలన, అధ్యయన ప్రాతిపదికగా ఆయన రచనలు సాగాయి. మార్క్సిస్టు గతితర్కాన్ని ఆయన ఆలోచనలను అనుగణంగా భారతదేశ చరిత్రకు, తాత్విక ధోరణులకు అనువర్తింపచేశాడు.
"మానవజాతి ప్రగతిపథంవైపు సాగించిన ప్రతి అడుగూ రక్తతర్పణంతోనే సాగింది. నర రక్తం ఇంతగా ప్రవహించడానికి అన్ని మతాల ధర్మాచార్యులే కారణం; వారే భాధ్యులు. ఏ ఒక్క మతము, ఏ ఒక్క మతాచార్యుడు గర్వించవల్సింది ఏమీలేదు" అని చారిత్రక ఆధారాల రీత్యా తన రచనల ద్వారా ఆయన రుజువు చేశాడు. ప్రస్తుత రాజకీయ, సామాజిక వాతావరణంలో రాహుల్జీ పుస్తకాల పఠనం అత్యంత ఆవశ్యకం.
ఇందులో భాగంగానే ఆర్యసమాజ ఇతివృత్తంగా దివోదాసు నవల, బుద్ధుడి సత్యజ్ఞాన సంపాదనను గూర్చి లోకసంచారి అనే సంకలనం.

No comments:

Post a Comment

Visalaandhra Publishing House